హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీక ఇఫ్తార్

by Naveena |
హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీక ఇఫ్తార్
X

దిశ, జడ్చర్ల:

పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో సమైక్యత భావాన్ని పెంపొందిస్తాయని ఇలాంటి సమైక్య భావం రాష్ట్ర ప్రగతికి నిదర్శనమని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. శుక్రవారం జడ్చర్ల పట్టణంలోని చంద్ర గార్డెన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింల ప్రత్యేక ప్రార్థనల అనంతరం కొత్వాల్ కు ఎమ్మెల్యే ఖర్జూరపండు ఉపవాస విరమణ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా భారతీయులు అంతా ఒక్కటేననే సమైక్యత భావన దేశ,రాష్ట్ర ప్రగతికి వూతం ఇస్తుందన్నారు. విందుకు హాజరైన ముస్లిం సోదరులకు ఆయన ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ కలిసిమెలిసి ఇఫ్తార్ విందులను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందన్నారు. పట్టణ ప్రజలకు విధిస్తున్న ఈద్గా సమస్యను కబ్రస్థాన్ సమస్యను అతి త్వరలోనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌస్ రబ్బాని ఇస్తే కార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మినాజ్, నిఖిల్ రెడ్డి కౌన్సిలర్ రహీం, హర్షాద్, ఫహద్, ఇంతియాజ్ బాబా, ఫక్రుద్దీన్, సర్ఫరాజ్, నిత్యానందం, కుమ్మరి రాజు, బుక్క వెంకటేశం, వెంకటయ్య, కాజా లిముద్దిన్, సయ్యద్ అహ్మద్ ,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Next Story