ఫోన్‌ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు మరోసారి నోటీసులు

by M.Rajitha |
ఫోన్‌ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు మరోసారి నోటీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : పోలీసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు శ్రవణ్ రావు ప్రయత్నాలు చేస్తున్నారని , విచారణలో అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని విచారణ అధికారులు తెలుపుతున్నట్లుగా సమాచారం . ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ6 నిందితుడిగా ఉన్నా శ్రవణ్ రావు మరోసారి విచారణకు హజరవ్వలంటు సిట్ అధికారులు బుధవారం విచారణ సమయంలో నోటీసులు అందజేశారు. ఏప్రిల్ 8వ తేదీన మళ్లీ తమ ఎదుట హాజరుకావాలని నోటీసులలో పేర్కోన్నారు. విచారణ లో భాగంగా 2023లో జరిగిన ఎన్నికల సందర్భంగా వాడిన సెల్ ఫోన్లు అందజేయాలని సిట్ అధికారులు శ్రవణ్ రావుకు తెలిపారు. రెండు సెల్ ఫోన్లు ఇవ్వాలని అడిగితే ఒకటే ఇచ్చి తప్పించుకున్న తెలుస్తున్నది.

పాత తుప్పు పట్టిన సెల్ ఫోన్ ని పోలీసులకు అందజేసినట్లు తెలుపుతున్నారు. శ్రవణ్ రావు అందజేసిన సెల్ ఫోన్లో చూసి షాక్ కు గురైనట్లు పోలీసు అధికారులు తెలుపుతున్నారు. తాము అడిగిన సెల్ ఫోన్లు, సమాచారం ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలుస్తున్నది. సిట్ కు పూర్తిస్థాయిలో సహకరించాలని సుప్రీంకోర్టు సూచించిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ శ్రవణ్ రావు విచారణకు సహకరిచండం లేదని పోలీసు అధికారులు తెలుపుతున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలతో తనకు ఎలాంటి సంబంధం లేదని విచారణ సమయంలో శ్రవణ్ రావు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తున్నది. మాజీ ఎస్ ఐబీ ఛీఫ్ ప్రభాకర్ రావు తో మాత్రమే తెలుసునని చెబుతున్నరని తెలుస్తున్నది.



Next Story

Most Viewed