Modi: మోడీతో రాజ్‌ నాథ్ సింగ్ భేటీ.. 40 నిమిషాల పాటు కీలక అంశాలపై డిస్కషన్

by vinod kumar |
Modi: మోడీతో రాజ్‌ నాథ్ సింగ్ భేటీ.. 40 నిమిషాల పాటు కీలక అంశాలపై డిస్కషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) తో కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath singh) సోమవారం భేటీ అయ్యారు. మోడీ నివాసంలో జరిగిన భేటీలో సుమారు 40 నిమిషాల పాటు కీలక అంశాలపై డిస్కస్ చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajith Dowal) కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. జమ్మూ కశ్మీర్ (Jammui Kashmir) లో కొనసాగుతున్న చర్యలు, భద్రతా పరమైన ఏర్పాట్లపై రాజ్ నాథ్ మోడీకి వివరించారు. మీటింగ్ అనంతరం భారత ప్రభుత్వ తదుపరి చర్యకు సంబంధించి ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందని కథనాలు వెలువడినా అటువంటి ప్రకటనేమీ రాలేదు. దాడి తర్వాత పాకిస్తాన్‌ను ఎదుర్కోవడానికి కీలకమైన సైనిక నిర్ణయలు తీసుకరనేందుకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్‌తో రాజ్ నాథ్ చర్చలు జరిపిన మరుసటి రోజే ఈ భేటీ జరగడం గమనార్హం.

ఉగ్రవాద దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం నిరంతరం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. పాకిస్తాన్‌తో సింధు నది ఒప్పందాన్ని ముగించడం సహా పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేసింది. పాక్ పౌరులు వెళ్లి పోవాలని ఆదేశించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడి వెనుక ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత సైన్యం ఆపరేషన్ కొనసాగిస్తోంది. దీంతో తదుపరి చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే రాజ్ నాథ్ సింగ్ ఉన్నతాధికారులు, ప్రధాని మోడీతో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది.

Next Story

Most Viewed