Chandrababu: ఆ స్వామి వారే నాకు ప్రాణభిక్ష పెట్టారు .. అలిపిరి ఘటనను గుర్తు చేసుకున్న చంద్రబాబు

by Anil Sikha |
Chandrababu: ఆ స్వామి వారే నాకు ప్రాణభిక్ష పెట్టారు .. అలిపిరి ఘటనను గుర్తు చేసుకున్న చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి (Tirumala) తనను కాపాడాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుమల క్షేత్ర అభివృద్ధిపై సీఎం ఈరోజు సమీక్ష నిర్వహించారు. పద్మావతి వసతి గృహంలో ఈవో, టీటీడీ చైర్మన్, పాలకమండలి సభ్యులతో సమావేశం అయ్యారు. చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతూ అలిపిరి వద్ద జరిగిన బ్లాస్టింగ్ ఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. 24 క్లైమోర్ మైన్స్ తనపై బ్లాస్ట్ చేశారని అన్నారు. నేను ఏ తప్పు చేయలేదు. ప్రజాహితం కోసం పనిచేశానన్నారు. ఇప్పటికీ ఆ ఘటన తనకు గుర్తుందన్నారు. వెంకటేశ్వర స్వామి మహిమ ఎంతో గొప్పది అన్నారు. దానివల్లే నేను బయటపడ్డాను అని చెప్పారు. ఇక్కడ ఉండే వ్యక్తులు ఎవరు అపచారం చేయకూడదు అన్నారు. గడచిన ఐదు సంవత్సరాలలో అపవిత్రం చేశారని అన్నారు. దానిపై ఎన్నో పోరాటాలు చేసామని తెలిపారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడేందుకు పాలకమండలి సభ్యులు (TTD) పనిచేయాలన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసేవారు హిందువులు మాత్రమే ఉండాలన్నారు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో వెంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మిస్తామని తెలిపారు. అదేవిధంగా విదేశాలలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కడతామన్నారు. వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటాడు అక్కడ ఆరోగ్యం బాగుంటుందన్నారు. భక్తులకు ప్రసాదాలు వడ్డిస్తే వచ్చే సంతృప్తి వెలకట్టలేనిది అన్నారు. ఏడుకొండలు వెంకటేశ్వర స్వామి సొంతమన్నారు. ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగకూడదన్నారు. తిరుమలలో పరిశుభ్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

Next Story