- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తిరుమలలో సీఎం చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) తన మనవడి పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) లో ప్రత్యేక పూజలు (Special Pujas) చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం సత్రం (Annadanam Satram)లో భోజనం వడ్డించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సత్రంలోనే సీఎం చంద్రబాబు భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముంతాజ్ హోటల్, దేవలోక స్థల కేటాయింపు రద్దు (Mumtaz Hotel, Devaloka land allotment cancelled) చేస్తున్నట్లు ప్రకటించారు. టీటీడీ ఆస్తులు అన్యాక్రాంతం కానివ్వమని చెప్పుకొచ్చారు. ఎవరైన TTD ఆస్తులను ఆక్రమిస్తే తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.
అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు.. విదేశాల్లో వెంకటేశ్వర ఆలయాలను (Venkateswara Temple) నిర్మిస్తామని స్పష్టం చేశారు. దీంతో పాటుగా గత కొద్ది రోజులుగా వివాదంగా మారుతున్న.. తిరుమలలో అన్యమతస్తులు ఉద్యోగులు (Other religiousemployees)గా ఉండటంపై సీఎం (CM) మాట్లాడుతూ.. తిరుమలలో హిందువులే పనిచేయాలని, ఆలయ పవిత్రతను ప్రతి ఒక్కరు కాపాడాలని పిలుపు నిచ్చారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే తిరుమలలో తాగునీటి సమస్య రానివ్వ బోమని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) హామీ ఇచ్చారు. నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు సీఎం కుటుంబ సభ్యులు అందరూ వెళ్లారు.