మాకు స్టాలినే సీఎంగా కావాలి

by John Kora |
మాకు స్టాలినే సీఎంగా కావాలి
X

- రెండో స్థానంలో యాక్టర్ విజయ్

- తర్వాతి స్థానాల్లోపళనిస్వామి, అన్నామలై

- సీ-ఓటర్ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడుకు సంబంధించి సీ-ఓటర్ సంస్థ చేసిన సర్వేలో మెజార్టీ ప్రజలు ఎంకే స్టాలిన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 27 శాతం మంది స్టాలిన్ సీఎంగా ఉండాలని చెప్పారు. ఇక కొత్తగా తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ పెట్టిన యాక్టర్ విజయ్ సీఎంగా ఉండాలని 18 శాతం మంది కోరుకున్నారు. ఆ తర్వాత స్థానాల్లో 10 శాతం మంది ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, 9 శాతం మంది బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలై కావాలని అన్నారు.ఈ సర్వేలో స్టాలిన్‌ను కోరుకునే వారి సంఖ్య అత్యధికంగా ఉండటం గమనార్హం. స్టాలిన్ లీడర్‌షిప్ పట్ల ఎక్కువ మంది పాజిటివ్‌గా స్పందించడం రాబోయే ఎన్నికల్లో డీఎంకే విజయానికి చిహ్నమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

కాగా, పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేయని యాక్టర్ విజయ్ 18 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో విజయ్, అతని పార్టీ పట్ల పెరుగుతున్న ఆదరణకు ఇది ఒక ఉదాహరణ అని అంటున్నారు. స్టాలిన్‌కు ప్రధాన ప్రత్యర్థిగా యాక్ట్ విజయ్ ఎదుగుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వ పనితీరు పట్ల కూడా ఈ సర్వే అంచనాలు వేసింది. ప్రభుత్వ పని తీరు చాలా బాగుందని 15 శాతం మంది చెప్పగా, 36 శాతం మంది మాత్రం కొంత వరకు సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. ఇక 25 శాతం మంది అస్సలు సంతృప్తిగా లేమని అన్నారు. 24 శాతం మంది మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి స్టాలిన్ పనితీరు చాలా బాగుందని 22 శాతం మంది, కొంత వరకు బానే ఉందని 33 శాతం మంది, అస్సలు బాగాలేదని 22 శాతం మంది, ఇంకా నిర్ణయం తీసుకోలేదని 23 శాతం మంది పేర్కొన్నారు. స్టాలిన్ పాలన పట్ల ప్రజలు స్పందన మిశ్రమంగా ఉందని సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు పళనిస్వామి పని తీరు 8 శాతం మంది మాత్రమే చాలా బాగుందని చెప్పారు. 27 శాతం మంది కొంత మేర సంతృప్తిగా ఉన్నామని,. 32 శాతం మంది అస్సలు బాగాలేదని అన్నారు. ఇక 33 శాతం మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఓట్లను ప్రభావితం చేసే సమస్యల గురించి అడిగిప్పుడు 15 శాతం మహిళల భద్రత, 12 శాతం ధరల పెరుగుదల, 10 శాతం మాదకద్రవ్యాలు, మద్యం వాడకం పెరుగుదలపై అసంతృప్తిగా ఉన్నారు. 8 శాతం మంది నిరుద్యోగ సమస్యపై ఆందోళన చెందుతున్నారు.

Next Story

Most Viewed