TG: విద్యార్థులకు మరో అవకాశం.. గడువు పొడిగింపు

by Gantepaka Srikanth |
TG: విద్యార్థులకు మరో అవకాశం.. గడువు పొడిగింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహాత్మాజ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 బ్యాగ్ లాగ్ సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల దాఖలుకు గడువు పొడిగించారు. బీసీ గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9వ తరగతుల బ్యాగ్ లాగ్ సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించేందుకు గడువును 31.03.2025 నుంచి 06.04.2025 వరకు పొడిగించారు. ఈ అవకాశాని సద్వినియోగం చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తంగా 6832 బ్యాగ్ లాగ్ సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు.

ఎంట్రెన్స్​ఎగ్జామ్‌ను ఏప్రిల్ 20, 2025 ఆదివారం ఉదయం పదిగంటల నుంచి నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. మెరిట్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతుల సీట్లను భర్తీ చేస్తామన్నారు. ప్రవేశ పరీక్షకు అర్హులైన విద్యార్థులు ఈ నెల 06-04-2025 లోగా www.mjptbcwreis.telangana.gov.in, https://mjptbcadmissions.org వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని బడుగు సైదులు వివరించారు.

Next Story

Most Viewed