- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ హీరో ఓ బ్రాండ్ లాంటి వాడు.. అందుకే ఆలోచించకుండా సినిమా ఒకే చేశా.. శ్రీనిధి శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి(Srinithi Shetty) ‘కేజీఎఫ్’ చిత్రంతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. మొదటి మూవీనే హిట్ కావడంతో అమ్మడు రేంజ్ మారిపోయింది. దీంతో అమ్మడుకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. శ్రీనిధి శెట్టి తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం శ్రీనిధి, నాని (nani) కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘హిట్-3’. సైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. అయితే ఈ మూవీ ఘన విజయం సాధించిన ‘హిట్’కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 1న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా, శ్రీనిధి శెట్టి ‘హిట్-3’ ప్రమోషన్స్‌లో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘హిట్-3 స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చిన సమయంలో ఏం ఆలోచించకుండా ఈ సినిమాను అంగీకరించాను. దానికి కారణం.. నాని అంటేనే ఓ బ్రాండ్. కాబట్టి ఆయనతో నటించే చాన్స్ వచ్చినప్పుడు ప్రశ్నలు అడగకుండా అంగీకరించాలి.
అందుకే అలా చేశాను. ఇందులో నేను అర్జున్ సర్కార్ భార్యగా కనిపించబోతున్నాను. అయితే నేను ఎక్కువగా ప్రోమోస్‌లో కనిపంచలేదు. కానీ నా పాత్ర చాలా శక్తివంతమైనది చాలా బాగుంటుంది. నా కెరీర్ మీద ఈ క్యారెక్టర్ చాలా ప్రభావం చూపిస్తుందని కోరుకుంటున్నాను. మీ అందరూ ఆదరిస్తారని భావిస్తున్నా’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీనిధి శెట్టి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా 10 రోజులు మాత్రమే ఉండటంతో నాని హిట్-3 ప్రమోషన్స్ కోసం మూడు రోజులు ముంబైలోనే ఉండబోతున్నట్లు టాక్. ఆయన ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.