2న ఢిల్లీలో బీసీల పోరుగర్జన : బీసీ నేత జాజుల శ్రీనివాస్​గౌడ్​

by M.Rajitha |
2న ఢిల్లీలో బీసీల పోరుగర్జన : బీసీ నేత జాజుల శ్రీనివాస్​గౌడ్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏప్రిల్ 2న ఢిల్లీలో బీసీల పోరుగర్జన మహా ధర్నాను బీసీ సంక్షేమ సంఘం తలపెట్టింది. ఢిల్లీలోని జంతర్​మంతర్​వద్ద చేపడుతున్నారు. ఈ ధర్నా కోసం సోమవారం హైదరాబాదు నుంచి చర్లపల్లికి వేలాదిగా చేరుకున్న బీసీ శ్రేణులు చేరుకోని ప్రత్యేక రైలులో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి రైలు ప్రారంభించారు. అంతుమందుకు జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని ఈ పార్లమెంట్ సమావేశంలోని ఆమోదించాలని డిమాండ్​చేశారు. తమిళనాడు తరహలో 9వ షెడ్యూలో బీసీ రిజర్వేషన్లు చేర్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ రాష్ట్రంలో పోరాడి మొదటి మెట్టు సాధించామని, ఇక బీసీ ఉద్యమాన్ని ఢిల్లీకి విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రం బీసీ బిల్లుకు ఆమోదం ముద్ర వేయాలని, లేదంటే రెండో నెల జరిగే మహా ధర్నాతో బీసీల బలం సత్తా చూపిస్తామన్నారు.

బీజేపీ పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదిస్తే 2వ తేదీన విజయోత్సవ సభ నిర్వహిస్తామని, లేనిపక్షంలో దేశవ్యాప్త మరో మండల్ ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. బీసీ బిల్లు పై ఢిల్లీ పెద్దలను ఒప్పించి ఆమోదించే బాధ్యత కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు బాధ్యత తీసుకోవాలన్నారు. బీసీల ఢిల్లీ పోరుతో దేశంలో పెద్ద చర్చ జరిగేలా, ఢిల్లీ పెద్దలు దిగివచ్చేలా బీసీ మహా ధర్నాను చేపడతామని అన్నారు. బీసీ ఉద్యమ చరిత్రలో మొదటిసారి ప్రత్యేక రైలులో వేలాదిమంది బీసీ శ్రేణులు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి చరిత్ర సృష్టించబోతున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే మహా ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లతో పాటు, అఖిలపక్ష రాజకీయ నేతలను కూడా ఆహ్వానించామని ఈసందర్భంగా జాజుల శ్రీనివాస్​గౌడ్ ​చెప్పారు.

Next Story

Most Viewed