- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అలియా భట్‌తో నన్ను పోల్చడం నాకు అస్సలు నచ్చలేదు.. షాలిని పాండే షాకింగ్ కామెంట్స్

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ షాలిని పాండే(Shalini Pandey) ‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. అయితే విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) హీరోగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఒక్కసారిగా షాలిని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్క సినిమాతో అమ్మడుకి ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఆ తర్వాత తెలుగు షాలిని పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కొద్ది కాలానికి ఆఫర్లు కూడా తగ్గిపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడే అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ పాపులారిటీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవల ఈ భామ ‘డబ్బా కార్టెల్’అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజుల నుంచి షాలిని పాండేను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్‌తో పోలుస్తూ కొంతమంది పలు పోస్టులు షేర్ చేస్తున్నారు. తాజాగా, ఈ విషయం షాలిని స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ప్రేక్షకులు నన్నెంతగానో ప్రేమిస్తున్నారు. నేను వారి ప్రేమను వెలకట్టలేను. కానీ కొంతమంది నన్ను అలియాభట్‌తో పోలుస్తూ తమ ప్రేమను తెలియజేస్తున్నారు. మనకు ఇండస్ట్రీలో ఇప్పటికే ఒక అలియా ఉంది.
కాబట్టి ఆమెలా మరొకరు అవసరం లేదని నా అభిప్రాయం. ఆమెలా ఉండాలని వేరొకరు అనుకోరు. ఎందుకంటే, అలియా అద్భుతమైన నటి అందంగా కూడా ఉంటుంది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ ఆమె ఎంతో ఉన్నతంగా ఉంటారు. నేను కూడా తన నుంచి ఎంతో స్పూర్తి పొందుతుంటా. ఎన్నో విషయాలు నేర్చుకోవాలనుకుంటాను. అయితే ఆమెతో పోల్చి చూస్తుంటే మాత్రం పెద్దగా నచ్చడం లేదు. ప్రేక్షకులు నన్ను నాలా గుర్తిస్తే చాలు. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనేది నా కోరిక’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం షాలిని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ చర్చకు దారితీస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న వారు కొందరు షాక్ అవుతున్నారు.