ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురు స్పాట్ డెడ్

by srinivas |   ( Updated:2025-01-10 16:54:09.0  )
ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలం తక్కలపల్లి-అనంతారం మధ్యలో రెండు బైకులు ఎదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జాబితాపూర్ గ్రామానికి చెందిన బత్తుల సాయి (20), అరవింద్ (20) సోమన్ పల్లి‌లో బంధువుల ఇంటికి తిరుపతి ప్రసాదం ఇచ్చి తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ క్రమంలో అనంతారం– తక్కళ్లపల్లి మధ్యలో వీరి బైక్ ఎదురుగా వస్తున్న మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన దయాల వంశీ (22) బైక్ను ఎదురెదురుగా ఢీట్టాయి. ఈ ప్రమాదంలో అరవింద్, వంశీలు తీవ్ర గాయాలతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో యువకుడు సాయిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చనిపోయాడు. ఇదిలా ఉండగా దయాల వంశీ వారం క్రితమే గల్ఫ్ నుండి వచ్చినట్లు బంధువులు చెప్తున్నారు. యువకుల మృతితో ఆయా గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. యాక్సిడెంట్ అయిన స్పాట్‌ను ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందర్ పరిశీలించారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed