హిట్ కాంబో రిపీట్.. పవన్ దర్శకత్వంలో మృణాల్-దుల్కర్ సినిమా!

by Hamsa |
హిట్ కాంబో రిపీట్.. పవన్ దర్శకత్వంలో మృణాల్-దుల్కర్ సినిమా!
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం’ సినిమాతో ఘన విజయాన్ని సాధించిన ఆయన అదే ఫామ్‌తో దూసుకుపోతున్నారు. గత ఏడాది ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) మూవీతో కూడా బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోలకు పోటీనిస్తున్నారు. ప్రస్తుతం పవన్ సాధినేని(Pawan Sadhineni) దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నారు.

దీనిని సందీప్ గుణ్ణం నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘ఆకాశంలో ఒక తార’(Aakasam Lo Oka Tara) జూలైలో విడుదల కాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, ఇందులో దుల్కర్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. సితారామంతో ఆల్రెడీ హిట్ కొట్టిన జంట కాబట్టి ఆడియన్స్ కూడా ఎగ్జైటింగ్‌గా ఉంటారని ఆమెను సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుండటంతో అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story

Most Viewed