- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీకి మరో గుడ్ న్యూస్.. ఆ నిధులు విడుదల చేసిన కేంద్రం

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)కి కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. బాపట్ల జిల్లా(Bapatla district)లోని సూర్యలంక బీచ్(Suryalanka Beach) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు(central Govt Funds) విడుదల చేసింది. సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.97.52 కోట్లు విడుదల చేసినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) తాజాగా వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద ఈ నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సూర్యలంక బీచ్‌ను తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు.
నిధులు(Funds) విడుదల చేసిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్(Central Minister Gajendrasingh Shekavath)కు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పర్యాటక శాఖ అభివృద్ధి పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఇటీవల మంత్రి దుర్గేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సూర్యలంక బీచ్‌కు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి దుర్గేష్ కోరారు.