ఇప్పటికీ నా చేతులు వణుకుతున్నాయి.. షాకింగ్ వీడియో షేర్ చేస్తూ నటి ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
ఇప్పటికీ నా చేతులు వణుకుతున్నాయి.. షాకింగ్ వీడియో షేర్ చేస్తూ నటి ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: థాయ్‌లాండ్, మయన్మార్‌లో భూకంపం సంభవించడంతో అక్కడి జనాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. పలు నగరాల్లో భవనాలు కుప్పకూలిపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే అక్కడ పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నట్లు సమాచారం. కొంతమంది అక్కడి వీడియోలు షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక భూకంపం సృష్టించిన విధ్వంసంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మళయాళ నటి పార్వతి కృష్ణ(Parvati Krishna) అక్కడే ఉన్నట్లు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘ఇప్పటికీ నా చేతులు వణుకుతున్నాయి.

ఇంకా నేను బతికే ఉన్నందుకు సంతోషిస్తున్నాను. నా జీవితంలో అతి భయంకరమైన భూకంపం ఇదే. బ్యాంకాక్‌లో 7.7 తీవ్రతతో సంభవించడంతో అందరూ భయపడిపోయారు. నా కళ్లముందే భారీ భవనాలు కుప్పకూలిపోయాయి. జనాలు పరుగులు తీశారు. ఎక్కడికైనా వెళ్దామంటే రవాణా వ్యవస్థ కూడా లేదు. ఆ సమయంలో నేను నా కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడుకున్నా సంతృప్తిగా అనిపించింది. భూకంపం అంతా మార్చేసింది. జీవితంలో నాకు ఇది రెండు అవకాశం అనుకుంటున్నాను. బతకడాపికి మరో చాన్స్ వచ్చింది. అందరినీ కలిసే అదృష్టం దక్కినందుకు ఆనందంగా ఉంది. ఈ కష్టసమయాన్ని దాటేందుకు మీరు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed