- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Stock Market: హమ్మయ్య..పుంజుకున్న మార్కెట్లు..సెన్సెక్స్ 1180 పాయింట్లు జంప్

దిశ, వెబ్ డెస్క్: Stock Market: సోమవారం, ఏప్రిల్ 7న భారత స్టాక్ మార్కెట్‌లో సునామీ తర్వాత, మార్కెట్ ఈరోజు మంగళవారం తిరిగి పుంజుకుంది. మంగళవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 1100 పాయింట్ల లాభంతో 74,013.73 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ ను ఆరంభించింది. నిప్టీ మళ్లీ 22,500మార్క్ ను అందుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 1180.73 పాయింట్లు ఎగబాకి 74,318.63 వద్ద నిఫ్టీ 361 పాయింట్ల లాభంతో 22, 522.60 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
మంగళవారం 30 సెన్సెక్స్ కంపెనీలలో 29 కంపెనీల షేర్లు లాభంతో గ్రీన్ మార్క్ లో ప్రారంభం అవ్వగా.. 1 కంపెనీ షేరు నష్టంతో ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ 50లోని 50 కంపెనీలలో 46 కంపెనీల షేర్లు లాభంతో గ్రీన్ మార్కులో ప్రారంభమయ్యాయి. మిగిలిన 4 కంపెనీల షేర్లు నష్టంతో రెడ్ మార్కులో ప్రారంభమయ్యాయి. ఈరోజు సెన్సెక్స్ కంపెనీలలో టాటా స్టీల్ షేర్లు అత్యధికంగా 5.02 శాతం లాభంతో ప్రారంభమయ్యాయి. సన్ ఫార్మా షేర్లు 0.28 శాతం క్షీణతతో ప్రారంభమయ్యాయి.
వీటితో పాటు ఇతర సెన్సెక్స్ కంపెనీలలో టైటాన్ షేర్లు 4.71 శాతం, టాటా మోటార్స్ 3.56 శాతం, అదానీ పోర్ట్స్ 3.12 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.97 శాతం, ఇన్ఫోసిస్ 2.88 శాతం, టెక్ మహీంద్రా 2.82 శాతం, లార్సెన్ & టూబ్రో 2.58 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.56 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.42 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 2.34 శాతం, మహీంద్రా & మహీంద్రా 2.25 శాతం, ఎన్‌టిపిసి 2.03 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 2.02 శాతం, భారతీ ఎయిర్‌టెల్ 1.90 శాతం, మారుతి సుజుకి 1.79 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.60 శాతం లాభాలతో ప్రారంభమయ్యాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 1.52 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.49 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.48 శాతం, పవర్ గ్రిడ్ 1.38 శాతం, జొమాటో 1.36 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.18 శాతం, టీసీఎస్ 1.13 శాతం, ఐటీసీ 1.02 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.00 శాతం, నెస్లే ఇండియా 0.84 శాతం, హిందుస్తాన్ యూనిలీవర్ 0.79 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 0.40 శాతం లాభపడి మంచి రికవరీని సాధించాయి.