కెమెరాలకు చెక్.. ఇక Wifi రూటర్లతోనే ఆ పనులు!

by Veldandi saikiran |   ( Updated:2025-04-08 04:43:38.0  )
కెమెరాలకు చెక్.. ఇక Wifi రూటర్లతోనే ఆ పనులు!
X

దిశ, వెబ్ డెస్క్: కాలం మారినా కొద్దీ జనాలు కూడా మారిపోతున్నారు. టెక్నాలజీ ( Technology) గతంలో కంటే ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. అప్పట్లో మనుషులు మాత్రమే పనిచేసేవారు.. కానీ ఇప్పుడు రోబోలు (Robots), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( Artificial Intelligence ) టెక్నాలజీ వచ్చేసింది. అయితే టెక్నాలజీలో భాగంగా చాలా మంది కెమెరాలు ( Cameras) తమ అవసరాల కోసం వినియోగిస్తూ ఉంటారు.

ఇంటి దగ్గర లేదా, బిజినెస్ రంగంలో, సొంత వ్యాపారాల్లో కెమెరాలు అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా కెమెరాలనేవి కామన్ అయిపోయాయి. అయితే ఇప్పుడు వైఫై రూటర్లు ( WiFi Routers) కూడా సీసీ కెమెరాలు చేసే పని చేస్తాయని చెబుతున్నారు. వైఫై రూటర్ ద్వారా మనుషుల కదలికలను బంధించవచ్చని స్పష్టం చేస్తున్నారు పరిశోధకులు. తాజాగా కార్నేగి మెల్లన్ యూనివర్సిటీ కి ( Carnegie Mellon University ) సంబంధించిన పరిశోధకులు... కెమెరాలు లేకుండానే... మానవ కదలికలను గుర్తించారు.

దీని కోసం వైఫై రూటర్లను ఉపయోగించారు. కెమెరాలు లేకుండానే మానవ కదలికలను... గుర్తించేందుకు చాలా పరిశోధనలు చేసి.. ఈ కొత్త టెక్నాలజీ డెవలప్ చేశారు కార్నేగి మెల్లన్ యూనివర్సిటీ పరిశోధకులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఇందులో ఉపయోగించినట్లు తెలుస్తోంది. అలాగే వైఫై సిగ్నల్స్ వాడుకొని... కదలికలను గుర్తిస్తున్నారు. ఇది మంచి సక్సెస్ అయితే... ఇంటి సంరక్షణకు బాగా వాడుకోవచ్చు. వైఫై పెట్టుకొని... సిగ్నల్స్ వాడుకోవడమే కాకుండా కెమెరాలుగా కూడా మనం వినియోగించుకోవచ్చు.



Next Story