- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
విజయ్ కు పెను ప్రమాదం..చెట్టుపై నుంచి దూకేసిన అజ్ఞాత వ్యక్తి !

దిశ, వెబ్ డెస్క్: తమిళ్ స్టార్ హీరో విజయ్ కి ( Vijay) ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా మంచి ఆదరణ సంపాదించుకున్నారు విజయ్. అలాంటి హీరో విజయ్ ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూనే, రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఓ పార్టీని స్థాపించి తమిళనాడు ( Tamilnadu) రాజకీయాలను శాసించే... దిశగా అడుగులు వేస్తున్నారు హీరో విజయ్. అయితే అలాంటి హీరో విజయ్ కి తాజాగా ఓ అనూహ్య సంఘటన ఎదురైంది.
ర్యాలీ చేస్తున్న నేపథ్యంలో.. ఓ అభిమాని ( Fan ) చేసిన పనికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు విజయ్. చెట్టుపై నుంచి... హీరో విజయ్ ర్యాలీ చేస్తున్న వ్యాన్ పై దూకేశాడు ఓ అభిమాని. దీంతో... షాక్ అయిన విజయ్, ఆ తర్వాత అభిమానిని దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా పలకరించాడు. ఈ సంఘటన కోయంబత్తూర్ ( Coimbatore ) ర్యాలీలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.... అభిమానిపై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. ఓ హీరో కోసం అలా చెట్టుపై నుంచి దూకడం ఏంటి...? నీ కుటుంబం గురించి మొదట ఆలోచించు అంటూ చురకలు అంటిస్తున్నారు. విజయ్ ని చంపేందుకు... కుట్రలు పన్నారని.. అందుకే చెట్టు పై నుంచి ఓ అజ్ఞాత వ్యక్తి దూకాడని, తాము భావించినట్లు మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ అంటే.. ఆ మాత్రం ఉండాల్సిందిలే అంటూ... మరికొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.