- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Trending: వారెవ్వా పెళ్లి కార్డుపై మహేష్ బాబు ఫొటో.. ఫిదా అవుతోన్న నెటిజన్లు

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పెళ్లి కార్డులపై దేవుళ్ల ఫొటోలను ప్రింట్ చేయించడం చూస్తుంటాము. కానీ ఈ అభిమాని మాత్రం దేవుళ్ల ఫొటోలతో పాటు ఏకంగా తన అభిమాన హీరో ఫొటో కూడా ప్రింట్ చేయించాడు. అంతేకాదండోయ్ కార్డును ఊరంతా పంచడమే కాకుండా తానే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా నెట్టింట వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
కర్నూలు జిల్లాకు చెందిన సాయి చరణ్(Sai Charan) అనే వ్యక్తి సూపర్ స్టార్ మహేష్ బాబుకు వీరాభిమాని. మహేష్ బాబు ఫ్యాన్ క్లబ్‌లో చురుగ్గా ఉంటున్నాడు. ఈ హీరో సినిమా విడుదలైనా, పుట్టిన రోజైనా లేదా వేరే ప్రత్యేక సందర్భం ఏదైనా అతనిపై తన అభిమానాన్ని చాటుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఈసారి తన పెళ్లి కార్డు పై తన అభిమాన హీరో ఫొటో ప్రింట్ చేయించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా మహేష్ ఫ్యాన్స్ అంతా ఈ పెళ్లి కార్డును వైరల్ చేస్తున్నారు. ఇక ఈ మ్యారేజ్ కార్డును చూసిన అభిమానులు, నెటిజన్లు ఫుల్ ఫిదా అవుతున్నారు.
కాగా మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ‘SSMB-29’ మూవీలో నటిస్తున్నాడు. ఇక ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.