‘కేజీ నుంచి పీజీ వరకు.. కరిక్యులమ్‌‌లో మార్పులు’.. మంత్రి కీలక ప్రకటన?

by Jakkula Mamatha |   ( Updated:2025-03-31 07:20:31.0  )
‘కేజీ నుంచి పీజీ వరకు.. కరిక్యులమ్‌‌లో మార్పులు’.. మంత్రి కీలక ప్రకటన?
X

దిశ, డైనమిక్ ​బ్యూరో: త్వరలో కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తున్నాం అని మంత్రి అనగాని సత్యప్రసాద్​ తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రులు సత్యప్రసాద్‌, సత్యకుమార్‌ ఈ రోజు పర్యటించారు. రేపల్లె ఆర్టీసీ డిపోలో 10 నూతన ఎక్స్ప్రెస్ బస్ సర్వీస్ లను సత్య కుమార్ యాదవ్, చైర్మన్ కొనకళ్ల నారాయణతో కలిసి ప్రారంభించారు. తర్వాత చాట్రగడ్డలో శ్రీ సరస్వతి విద్యామందిర్‌ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ విద్యా రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టాం అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్‌లో మార్పులు చేస్తున్నామని తెలిపారు. డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయబోతున్నాం అన్నారు. సీఎం చంద్రబాబు తలపెట్టిన పీ 4 కార్యక్రమం ఎంతో గొప్ప ఆలోచన ఆయన అన్నారు. రేపల్లోలో వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సత్య కుమార్​ను ఆయన కోరారు. దీనికి మంత్రి స్పందించిన మంత్రి ప్రభుత్వ వైద్యశాల లో సేవలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.



Next Story

Most Viewed