CM Revanth Reddy: మావోయిస్టులతో శాంతి చర్చల ఇష్యూ.. జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

by Prasad Jukanti |
CM Revanth Reddy:  మావోయిస్టులతో శాంతి చర్చల ఇష్యూ.. జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, హోంశాఖ మాజీ మంత్రి జానారెడ్డి (Jana Reddy) నివాసానికి వెళ్లారు. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో సీఎం చర్చించనున్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారు నిలిపివేసి కాల్పుల విరమణ ఒప్పందం పాటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయయత్నించాలని జస్టిస్ చంద్రకుమార్ నేృత్వంలోని శాంతి చర్చల కమిటీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల అంశాన్ని తాము సామాజిక కోణంలోనే చూస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ విషయంలో జానారెడ్డి సలహాలు తీసుకుంటామని కమిటీతో చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయమే జానారెడ్డి నివాసానికి వెళ్లి ఆపరేషన్ కగారు (Operation Kagaru) పై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed