- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Minister Ponnam: ఆ భూములు హెచ్‌సీయూవి కావు.. మంత్రి పొన్నం కీలక స్టేట్‌మెంట్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (Hyderabad Central University)లో భూములు చదును చేయడాన్ని నిరసిస్తూ.. విద్యార్థులు ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే, అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తుగా (Telangana Police) భారీ భద్రతను ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాలను బుల్డోజర్లతో చదును చేసేందుకు యత్నించడంతో విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ సిబ్బంది ఫైర్ అయ్యారు. వెంటనే పనులను ఆపాలంటూ అక్కడే బైఠాయించి నిరసన తెలుపగా వారికి పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసకుంది.
ఈ నేపథ్యంలోనే హెచ్‌సీయూ (HCU) భూములపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక ప్రకటన చేశారు. హెచ్‌సీయూ (HCU)కి పక్కనే ఆనుకుని ఉన్న ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రైవేట్ సంస్థలకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం చేసి తిరిగి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) దక్కించుకుందని తెలిపారు. భూముల వేలం, అక్కడ చేపట్టబోయే అభివృద్ధి పనులతో యూనివర్సిటీకి ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు. అభివృద్ధికి పనులకు ఇచ్చిన భూమిలో చెరువు లేదని స్పష్టం చేశారు. అవసరం అయితే, మరోసారి హెచ్‌సీయూ (HCU) భూములపై ప్రభుత్వం పున: పరిశీలన చేస్తుందని హామీ ఇచ్చారు. యూనివర్సిటీ భూములను కాపాడటంతో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కామెంట్ చేశారు.
Read More..
Cabinet Expansion: కేబినెట్ విస్తరణ వేళ అనూహ్య పరిణామం.. అధిష్టానానికి ఆ జిల్లా ఎమ్మెల్యేల లేఖ