Arjun Son Of Vyjayanthi: కళ్యాణ్ రామ్ కోసం రంగంలోకి తారక్ !

by Veldandi saikiran |
Arjun Son Of Vyjayanthi: కళ్యాణ్ రామ్ కోసం రంగంలోకి తారక్ !
X

దిశ, వెబ్ డెస్క్: నందమూరి కళ్యాణ్ రామ్ ( Nandamuri Kalyan Ram ) కోసం మరోసారి రంగంలోకి దిగబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR). నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి ( Arjun Son Of Vyjayanthi ). ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్... ఏప్రిల్ 12వ తేదీన శనివారం రోజున జరగనుంది. హైదరాబాద్ మహానగర ఔట్ కట్స్ లో... ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారట. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా ఫ్రీ రిలీజ్ (Pre release Event ) ఈవెంట్ కోసం.. జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగబోతున్నారని సమాచారం అందుతుంది.


ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ తో కళ్యాణ్ రామ్ నేరుగా మాట్లాడారట. గతంలో కూడా.. ఎన్టీఆర్ సినిమాకు కళ్యాణ్ రామ్... కళ్యాణ్ రామ్ సినిమాకు ఎన్టీఆర్ స్పెషల్ గెస్టులు గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కళ్యాణ్ రామ్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా దిగుతున్నారు. కాగా... అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా ఏప్రిల్ 18వ తేదీన రిలీజ్ కానున్నట్లు తాజాగా ప్రకటన చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో విజయశాంతి ( Vijayashanthi ) కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కొడుకు అలాగే తల్లి మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో... ఈ సినిమా రానుందని చెబుతున్నారు. అంతే కాదు విజయశాంతి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట.

Next Story