- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పహెల్గాం మారణకాండ.. ‘ఆపరేషన్ టిక్కా’ పేరుతో రంగంలోకి భారత సైన్యం

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్‌లో కాల్పులకు పాల్పడిన ముష్కరులను బంధించేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్‌కు టిక్కా’కు తెరలేపింది. అసలు ఇంత సీరియస్ఆపరేషన్కు ఆ పేరునే ఎందుకు పెట్టారని చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. అయితే, ‘టిక్కా’ అంటే అదేదో ఫుడ్ పేరు అనుకుంటే పొరపాటే. దాన వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఈస్ట్పాకిస్తాన్గా పిలువబడే నేటి బంగ్లాదేశ్‌లో వేలాది మంది చావుకు కారణం నాటి పాక్సీనియర్సైన్యాధికారి జనరల్టిక్కా ఖాన్. అతడు ఈస్ట్పాకిస్తాన్ప్రజలపై ఎన్నో దారుణాలకు పాల్పడ్డాడు. యూనివర్సిటీలోకి సైన్యాన్ని పంపి వంద మందికిపైగా విద్యార్థులను చంపించాడు. అదేవిధంగా అక్కడున్న మహిళలపై కూడా అకృత్యాలకు పాల్పడాలని తన సైన్యాన్ని ఆదేశించాడు. అలాంటి టిక్కా ఖాన్‌ని బంధించడమే లక్ష్యంగా నాడు భారత సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఆ ప్రతి దాడికి పెట్టిన పేరే ‘ఆపరేషన్టిక్కా’. ఇప్పుడు మళ్లీ ఆ పేరు పెట్టడానికి కారణం.. ఈ ఘటన వెనుక పాక్ఉందని ప్రపంచానికి చెప్పడంతో పాటు ఘటనకు కారకుడైన లష్కర్-ఏ-తాయిబా సెకండ్ఇంచార్జ్ సయీఫుల్లా కసూరిని బంధించడం. అందుకే ఈ ఆపరేషన్‌కు భారత సైన్యం ‘టిక్కా’ అని పేరు పెట్టారు.