- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మా కుటుంబానికి అతడే ఏకైక ఆదారం.. ఇప్పుడేం చేయాలి.. ఉగ్రదాడి మృతుడి తండ్రి ఆవేదన

దిశ, వెబ్ డెస్క్: మా కుటుంబానికి అతడే ఏకైక ఆధారం అని, ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదని ఉగ్రదాడిలో మృతి చెందిన వ్యక్తి తండ్రి ఆవేదనతో మాట్లాడిన మాటలు వీక్షకుల మనసులను కదిలిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) పహల్గామ్ (Pahalgam)లో జరిగిన ఉగ్రదాడి (Terrorist Attack)లో 28 మంది చనిపోయారు. మృతులలో పహల్గామ్ సమీప గ్రామానికి చెందిన సయ్యద్ ఆదిల్ షా (Sayyad Adhil Shah) అనే వ్యక్తి కూడా ఉన్నారు.
ఆదిల్ షా మరణంపై తండ్రి స్పందిస్తూ.. మా కుటుంబానికి ఏకైక ఆధారం అతడేనని, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం (Jammu Kashmir Government) తమకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. ఆదిల్ హుస్సేన్ షా తండ్రి సయ్యద్ హైదర్ షా మీడియాతో మాట్లాడుతూ.. మా కుటుంబంలో ఆదిల్ ఒక్కడే సంపాదిస్తున్నాడని, గుర్రపు స్వారీ చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడని తెలిపారు. అలాగే మంగళవారం కూడా గుర్రపు స్వారీ పని కోసం పహల్గామ్ వెళ్లాడని, ఉగ్రదాడి వార్త తెలిసి మధ్యాహ్నం 3 గంటలకు ఆదిల్ కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందని అన్నారు.
తర్వాత 4 గంటలకు అతడి ఫోన్ ఆన్ అయ్యింది కానీ ఎవరు తీయలేదని చెప్పారు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లడంతో.. దాడిలో ఆదిల్ షా ఉన్నాడని తెలిసిందని అన్నారు. నా కుమారుడికి భార్య పిల్లలు ఉన్నారని, అతడే ఏకైక సంపాదకుడు అని తెలిపాడు. అంతేగాక తన కుమారుడు అమరుడు అని, అతడి మరణానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఇక ఆదిల్ అమాయకుడు అంటూ ఎందుకు చంపబడ్డాడో అర్థం కావడం లేదని, బాధ్యులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.