సన్న బియ్యం పంపిణీ పేద కుటుంబాలకు వరం లాంటిది : తాండూర్ ఎమ్మెల్యే

by Aamani |
సన్న బియ్యం పంపిణీ పేద కుటుంబాలకు వరం లాంటిది : తాండూర్ ఎమ్మెల్యే
X

దిశ, పెద్దేముల్: ప్రతి ఒక్కరి కడుపు నింపాలనే లక్ష్యంతో దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రజా పంపిణీలో గొప్ప పథకానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలందరికీ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం పెద్దేముల్ మండల కేంద్రంతో పాటుగా జనగాం గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా పేదలకు అందించే ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ధారసింగ్, కోట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ అంజయ్య, వైస్ చైర్మన్ నారాయణ్, టీపీసీసీ మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ రియాజ్, వికారాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు శోభారాణి, తట్టే పల్లి సొసైటీ డైరెక్టర్ ఉప్పరీ మల్లేశం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయకులు మహిపల్ రెడ్డి, ఎల్లారెడ్డి , పెండ్యాల ప్రవీణ్ కుమార్, ఇందూరు నరేందర్, ప్రకాశం, డివై నర్సింలు, రవిశంకర్, తాండూర్ ఏ బ్లాక్ అధ్యక్షుడు లోంక నర్సింలు, మైపుస్ తహశీల్దార్ వెంకటేష్ ప్రసాద్ రేషన్ డీలర్ల మండల అధ్యక్షడు అంజయ్య, రేషన్ డీలర్లు నందు, ఉపేందర్, ఇస్మాయిల్ రేషన్ లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed