‘నారి నారి నడుమ మురారి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఆకట్టుకుంటున్న పోస్టర్

by Kavitha |   ( Updated:2025-03-31 07:22:29.0  )
‘నారి నారి నడుమ మురారి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఆకట్టుకుంటున్న పోస్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanandh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఏడాది ‘మనమే’ (Maname) సినిమాతో ఓకే ఓకే అనిపించుకున్న ఆయన ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో రామ్ అబ్బరాజు( Ram Abbaraju) దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారీ’ (Nari Nari Naduma Murari) ఒకటి. ఈ మూవీలో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyuktha Menon), సాక్షి వైద్య (Sakshi Vaidhya) హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వెంచర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్స్ పై అనిల్ సుంకర (Anil Sunkara), రామబ్రహ్మం సుంకర (Ramabrahmam Sunkara) నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు బాలయ్య (Balakrishna) మూవీ టైటిల్ ఫిక్స్ చేయడంతో ఈ చిత్రం పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ సినిమాకు విశాల్ చంద్ర శేఖర్ (Vishal Chandrashekhar) సంగీతం అందిస్తున్నాడు.

ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘నారి నారి నడుమ మురారి సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘దర్శనమే’ (Darshaname) ఏప్రిల్ 7న రాబోతుంది’ అని వెల్లడించారు. అయితే ఈ సాంగ్ హీరోయిన్ సంయుక్త మీనన్‌తో ఉన్నట్లు పోస్టర్‌ను బట్టి చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed