నేను నచ్చకపోతే.. కనీసం ప్రభుత్వాన్నైనా మెచ్చుకోండి.. విపక్ష ఎమ్మెల్యేలకు CM సూచన

by Gantepaka Srikanth |
నేను నచ్చకపోతే.. కనీసం ప్రభుత్వాన్నైనా మెచ్చుకోండి.. విపక్ష ఎమ్మెల్యేలకు CM సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ(Telangana Assembly)లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం(Congress Government) ఎంత మంచి చేసినా విపక్ష ఎమ్మెల్యేలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. నన్ను మెచ్చుకోవడం ఇష్టం లేకపోతే.. కనీసం ప్రభుత్వాన్ని అయినా అభినందించాలని సూచించారు. ఇలా చేస్తే.. ప్రభుత్వం మరింత ఉత్సాహంతో పనిచేస్తుందని తెలిపారు. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్.. నాలుగేళ్లల్లో చేసిన మాఫీ రూ.16,143 కోట్లే అని గుర్తుచేశారు. వడ్డీ పోగా వీళ్లు మొదటి ఐదేళ్లల్లో చేసిన రుణమాఫీ 13,514 కోట్లు మాత్రమే అని తెలిపారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక.. మొదటి నాలుగేళ్లు రైతుల రుణమాఫీకి రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. చివరి ఏడాదిలో 21,35,557 మంది రైతులకు రూ.11,909 కోట్లు మాత్రమే మాఫీ(Runa Mafi) చేశారని తెలిపారు.

పదేళ్లలో బీఆర్ఎస్(BRS) చేసిన రుణమాఫీ రూ.16,908 కోట్లు మాత్రమే అని.. వీళ్లు మమ్మల్ని రుణమాఫీ చేయలేదని, మీ వల్ల కాలేదని మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 25,35,964 మంది రైతులకు రూ.20,616,89 కోట్లు మాఫీ చేశామని చెప్పారు. పదేళ్లలో మీరు చేసింది ఎంత? పది నెలల్లో మేం చేసింది ఎంత? చూడండని అన్నారు. ప్రజలు ఉరి తీసినా మీ ఆలోచనా విధానంలో మార్పు రాలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఎగ్గొట్టిన రైతుబంధును రూ.7,625 కోట్లు.. తాము అధికారంలోకి వచ్చాక చెల్లించామని తెలిపారు. రూ.4666.59 కోట్లు రెండో విడత రైతు భరోసా అందించామని గుర్తుచేశారు.

బీఆర్ఎస్ హయాంలో రూ.10 వేలు ఉన్న రైతు భరోసాను తాము అధికారంలోకి రాగానే రూ.12 వేలకు పెంచామని తెలిపారు. వరి వేస్తే ఉరి అని చెప్పిన వాళ్లు ఫామ్ హౌస్‌లో పండిన వడ్లను క్వింటాల్ రూ.4500 చొప్పున కావేరి సీడ్స్‌కు అమ్ముకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ మేం రూ.11 వేల 61 కోట్లు సన్న వడ్లకు బోనస్ ఇచ్చామని తెలిపారు.

Next Story

Most Viewed