రాజీవ్ యువ వికాసానికి అనుహ్య స్పందన.. ఎంతమంది అప్లై చేశారో తెలుసా?

by Gantepaka Srikanth |
రాజీవ్ యువ వికాసానికి అనుహ్య స్పందన.. ఎంతమంది అప్లై చేశారో తెలుసా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన రాజీవ్​యువ వికాసం పథకానికి అనుహ్య స్పందన వస్తోంది. ఈ స్కీమ్‌కు తెలంగాణ వ్యాప్తంగా భారీగా దరఖాస్తులు అందాయి. ఇప్పటికే అప్లికేషన్లు సుమారుగా 16 లక్షల అప్లికేషన్లు అందాయని బీసీ సంక్షేమ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన సర్కారు ధరఖాస్తు ప్రక్రియ గడువును ఈనెల 14 చివరి తేదీగా ప్రకటించింది. అయితే, ధరఖాస్తు గడువు తేదీని పొగడించాలని యువత కోరుతోంది. వాస్తవానికి మీసేవ సెంటర్ల ధరఖాస్తులో ఇబ్బందులతోపాటుగా వరుసగా వచ్చిన సెలవులతో చాలా వరకు సమస్యలు ఎదుర్కొన్నారు.

దీనికి అర్హతకు అవసరమైన సర్టిఫికెట్ల జారీలోనూ కార్యాలయల నుంచి సరైన వేళ అందకపోవంతో పథకానికి ధరఖాస్తు చేసుకునే యువత తిప్పలు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. యువతను దృష్టిలో ఉంచుకోని రాజీవ్​యువ వికాసం పథకం గడవును పొడగించాలని ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర నేత వెంకటస్వామి సైతం ముఖ్యమంత్రికి లేఖను రాశారు. అయినప్పటికీ ఈ స్కీమ్‌కు సంబంధించి, గడువు పొడగింపుపై సర్కారు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకపోవడంతో యువతలో ఆందోళన నెలకొంది. ఎలాగైనా గడవు పెంచాలని యువత కోరుతోంది. ఇంకా ప్రభుత్వం మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టం ఇవ్వలేదు. ఒకవేళ గడువు పొడిస్తే రాజీవ్​యువ వికాసం పథకానికి ధరఖాస్తులు మరింతగా పెరిగే అవకాశం ఉన్నది.



Next Story