- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
RLJP: ఎన్డీఏకు షాక్.. కూటమి నుంచి వైదొలగిన కీలక పార్టీ

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA) కూటమికి షాక్ తగిలింది. ఎన్డీఏ అలయెన్స్ నుంచి వైదొలగుతున్నట్టు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (RLJP) నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పశుపతి పరాస్ (Pashupathi paras) సోమవారం ప్రకటించారు. తమ పార్టీకి ఎన్డీఏకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పాట్నాలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ‘ఆర్ఎల్‌జేపీ 2014 నుంచి ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంది. కానీ ఎన్డీఏ నాయకత్వం అన్యాయం చేసింది. ఇక నుంచి ఆ కూటమితో ఎలాంటి సంబంధం ఉండదు’ అని తెలిపారు. బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాల్లోనూ తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఆర్ఎల్‌జేపీ కీలక పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఈ సాహసోపేతమైన డిసిషన్ తీసుకున్నామని చెప్పారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బిహార్ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. సీఎం నితీశ్ దళిత వ్యతిరేకి అని ఆరోపించారు. కాగా, ఎన్డీఏ ప్రభుత్వంలో ఆర్ఎల్‌జేపీ భాగస్వామ్యంగా ఉంది. ప్రస్తుత కేబినెట్ లో పరాస్ కేంద్ర మంత్రిగానూ ఉన్నారు. అయితే గత లోక్ సభ ఎన్నికల్లో తన పార్టీకి ఎన్డీఏ కూటమిలో భాగంగా ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.