Cooch Behar Trophy : కూచ్ బెహర్ ట్రోఫీ విజేత తమిళనాడు

by Sathputhe Rajesh |
Cooch Behar Trophy : కూచ్ బెహర్ ట్రోఫీ విజేత తమిళనాడు
X

దిశ, స్పోర్ట్స్ :కూచ్ బెహర్ ట్రోఫీ పురుషుల అండర్-19 టోర్నీ విజేతగా తమిళనాడు నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా తమిళనాడు, గుజరాత్ మధ్య జరిగిన ఫైనల్ ఆదివారం డ్రాగా ముగిసింది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన తమిళనాడు టైటిల్ సాధించింది. ముందుగా మౌల్యరాజ్ సింగ్(161) భారీ సెంచరీతో కదం తొక్కడంతో గుజరాత్ తొలి ఇన్నింగ్స్‌లో 380 రన్స్ చేసింది. అనంతరం కిశోర్(53), అంబ్రిష్(63), జయంత్(50) రాణించడంతో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 413 స్కోరు చేసి.. 53 పరుగుల ఆధిక్యం సాధించింది. శుక్రవారం చివరి సెషన్‌లో గుజరాత్ 172/7 స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ ఇచ్చి 120 పరుగుల టార్గెట్ పెట్టింది. అనంతరం తమిళనాడు ఛేదనకు దిగగా 55/1 స్కోరు వద్ద ఇరు జట్లు డ్రాకు అంగీకరించాయి. మ్యాచ్‌లో ఆదివారమే ఆఖరి రోజు అవడంతో ఫలితం తేలే అవకాశం లేకపోవడం, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతోనే విజేతను ప్రకటించనుండటంతో ఇరు జట్లు డ్రాకు ఒప్పుకున్నాయి. దీంతో తమిళనాడు తొలి అండర్-19 కూచ్ బెహెర్ ట్రోఫీ టైటిల్ కైవసం చేసుకుంది.

Advertisement

Next Story