- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Aishwarya: సూర్య-వెట్రిమారన్ ‘వాడివాసల్’ సినిమాలో ఐశ్వర్య ఫిక్స్..!
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటిస్తున్న తాజా చిత్రం ‘వాడి వాసల్’(Vaadivasal). దీనికి వెట్రిమారన్(Vetrimaran) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్(V Creations) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన 2019లో వచ్చినప్పటికీ విడుదల మాత్రం కాలేదు. ఇక ఇందులోంచి టైటిల్ రివీలింగ్ పోస్టర్ తప్ప మరో అప్డేట్ విడుదల రాలేదు. దీంతో ‘వాడి వాసల్’(Vaadivasal) ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది.
ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ 2025 మార్చి 31న థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు ప్రకటించారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో నటీనటులకు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు. దీంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘వాడి వాసల్’ మూవీలో ఐశ్వర్యలక్ష్మి(Aishwarya Lakshmi) సూర్యతో రొమాన్స్ చేయబోతున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, ఐశ్వర్య ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన స్దట్- 18 లో నటిస్తుంది.