Deep Tragedy: వైఎస్ జగన్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం.. సోదరుడు అభిషేక్ రెడ్డి మృతి

by srinivas |   ( Updated:2025-01-10 12:12:26.0  )
Deep Tragedy: వైఎస్ జగన్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం.. సోదరుడు అభిషేక్ రెడ్డి మృతి
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(Ys Jagan) ఫ్యామిలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జగన్ సోదరుడు వైఎస్ అభిషేక్ రెడ్డి(YS Abhishek Reddy) మృతి చెందారు. వైఎస్ అభిషేక్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అన్న ప్రకాశ్ రెడ్డి మనవడే అభిషేక్ రెడ్డి. వైద్య వృత్తిలో ఉన్న అభిషేక్ రెడ్డి.. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. గురువారం రాత్రి పరిస్థితి విషమించించింది. శుక్రవారం మధ్యాహ్నం అభిషేక్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు.


ఇక అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు శనివారం పులింవెందులలో నిర్వహించనున్నారు. ఈ విషయం తెలియడంతో ఆస్టేలియా నుంచి ఎంపీ అవినాశ్ రెడ్డి హుటాహుటినా ఇండియాకు బయల్దేరారు. అటు జగన్ కూడా పులివెందుల వెళ్లనున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ జగన్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో అభిషేక్ రెడ్డి పాల్గొన్నారు. ఇక అభిషేక్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్ననున్నారు. ప్రస్తుతం అభిషేక్ రెడ్డి పార్ధివదేహాన్ని పులివెందులకు తరలిస్తున్నారు.

Advertisement

Next Story