- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమ్మాయిలు దంచికొట్టారు.. తొలి వన్డేలో ఐర్లాండ్‌పై భారత్ ఘన విజయం
దిశ, స్పోర్ట్స్ : ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. మరోసారి ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన అమ్మాయిలు పసికూనను చిత్తు చేశారు. రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తడబడిన ఐర్లాండ్..కెప్టెన్ గాబీ లెవిస్(92), లెహ్ పాల్(59) రాణించడంతో పోరాడే స్కోరు సాధించింది. అయితే, 239 పరుగుల లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించింది. ఐర్లాండ్ బౌలర్లను ప్రాతిక రావల్(89), తేజాల్ హసబ్నిస్(53 నాటౌట్), స్మృతి మంధాన(41) ఉతికారేశారు. ఓపెనర్లు మంధాన, ప్రాతిక తొలి వికెట్‌కు 70 పరుగుల జోడించి అదిరిపోయే ఆరంభం అందించారు. ఆ తర్వాత ప్రాతిక, తేజాల్ మిగతా పని పూర్తి చేశారు. దీంతో భారత్ 34.3 ఓవర్లలోనే 4 వికెట్లే కోల్పోయి విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆదివారం రాజ్‌కోట్ వేదికగానే రెండో వన్డే జరగనుంది.