- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Vijay Deverakonda: విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సంక్రాంతికి ‘VD-12’ నుంచి బిగ్ సర్ ప్రైజ్..!
దిశ, సినిమా: సంక్రాంతి వచ్చిందంటే స్టార్ హీరోలు భారీ బడ్జెట్ చిత్రాలతో బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పటి లాగానే ఈ సారి సంక్రాంతి కానుకగా స్టార్ హీరోల సినిమాలు చాలానే విడుదలకు రెడీగా ఉన్నాయి. అయితే మేకర్స్ అంతా సంక్రాంతిని క్యాచ్ చేసుకుంటూ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ప్రాజెక్ట్స్‌కు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ‘వీడీ-12’ నుంచి బిగ్ సర్‌ప్రైజ్ రాబోతున్నట్లు టాక్.
ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి(Gowtham Tinnanuri) దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి సంక్రాంతికి టీజర్ విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న విజయ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.