Trump Iftar party: వైట్ హౌస్‌లో ‘ఇఫ్తార్ విందు’.. అండగా ఉంటానని ముస్లింలకు ట్రంప్ భరోసా

by Ramesh N |
Trump Iftar party: వైట్ హౌస్‌లో ‘ఇఫ్తార్ విందు’.. అండగా ఉంటానని ముస్లింలకు ట్రంప్ భరోసా
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ఇఫ్తార్ పార్టీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ముస్లిం సమాజం మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం వైట్ హౌస్‌లో (Iftar dinner at White House) ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ ట్రంప్‌తో పాటు ముస్లిం సమాజ నాయకులు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఈ ఇఫ్తార్ విందు చాలా ప్రత్యేకమైనదన్నారు. మనం ఇస్లామిక్ పవిత్ర మాసం రంజాన్‌లో ఉన్నందున, నా ముస్లిం స్నేహితులకు (Ramadan Mubarak) రంజాన్ ముబారక్‌.. అంటూ విషెస్ చెప్పారు.

‘2024 అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు సంఖ్యలో మాకు మద్దతు ఇచ్చిన లక్షలాది మంది ముస్లిం-అమెరికన్లకు నేను చాలా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయాలి. నవంబర్‌లో ముస్లిం సమాజం మాకు అండగా నిలిచింది. అధ్యక్షుడిగా నేను మీకు అండగా ఉంటాను’ అని అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా రంజాన్ పండుగ ప్రాముఖ్యతను ట్రంప్ వివరించారు. మనమందరం ప్రపంచానికి శాంతిని కోరుకుంటున్నామని తెలియజేశారు.

Next Story