రామ్ చరణ్ "పెద్ది" సినిమాలో ఐటెం సాంగ్... రంగంలోకి స్టార్ హీరోయిన్?

by Veldandi saikiran |   ( Updated:2025-03-28 06:20:54.0  )
రామ్ చరణ్  పెద్ది సినిమాలో ఐటెం సాంగ్... రంగంలోకి స్టార్ హీరోయిన్?
X

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రస్తుతం బుచ్చి బాబుతో సినిమా చేస్తున్నాడు. RC 16 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ , ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ అయింది. ఈ సినిమాకు పెద్ది ( Peddi Movie ) అనే టైటిల్ అనౌన్స్ చేశారు. అలాగే ఇందులో మాస్ లుక్ లో రామ్ చరణ్ కనిపించారు. ఈ సినిమాకు బుచ్చిబాబు ( Bucchi Babu) దర్శకత్వం వహిస్తుండగా... దర్శకుడు సుకుమార్ కూడా ఓ చేయి వేస్తున్నారట. ఇక పెద్ది సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యారు. జగపతిబాబు ( Jagapathi babu) ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.


ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ ( Ar Rahman ) పనిచేస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు కూడా పూర్తి చేశారట ఏఆర్ రెహమాన్. అయితే... మాస్ యాంగిల్ లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఐటమ్ సాంగ్ ( Item Song) రూపొందించబోతున్నారని సమాచారం. పుష్ప సినిమా తరహాలోనే... మంచి ఊపున్న ఐటమ్ సాంగ్ పెట్టాలని అనుకుంటున్నారట. దీనికోసం హీరోయిన్ సమంతను సంప్రదించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ అలాగే సమంత కలిసి నటించారు. ఆ సినిమా బ్రహ్మాండమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు పెద్దిలో ఐటమ్ సాంగ్ కోసం సమంతను (Samantha) సంప్రదించారట. భారీగా రెమ్యూనరేషన్ కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారట. అయితే దీనిపై సమంత ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read More..

నేచర్, యానిమల్, గుడ్ వైబ్స్ అంటూ క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్

Next Story

Most Viewed