- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బంపర్ ఆఫర్ అందుకున్న ఫరియా అబ్దుల్లా.. అదృష్టం అంటే ఇదే అంటున్న నెటిజన్లు

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు జాతిరత్నాలు సినిమాతో వచ్చి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. చిట్టి క్యారెక్టర్‌లో నటించిన ఆమె జనాలను కడుపుబ్బా నవ్వించింది. ఈ మూవీతో ఫరియా క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత చిట్టి పలు చిత్రాల్లో నటించినప్పటికీ అంతగా మెప్పించలేకపోయాయి. ఇక గత ఏడాది ఈ అమ్మడు కల్కి(Kalki), ఆ ఒక్కటి అడక్కు, మత్తు వదలరా-2 (Mathu Vadalara- 2)వంటి మూవీస్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘వళ్లి మెయిల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తోంది.
తాజాగా, ఫరియా ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వారసుడు జసన్ సంజయ్(Jason Sanjay) దర్శకత్వంలో రాబోతున్న మూవీలో నటించే చాన్స్ దక్కించుకున్నట్లు టాక్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నాడు. దీనికి తమన్ (Thaman)సంగీతం అందిస్తుండగా.. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఫరియా నటించిన మొదటి మూవీ విడుదల కాకుండానే రెండో అవకాశం లభించడం అదృష్టమనే చెప్పాలి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇక వరుస అవకాశాలు అందుకుని దూసుకుపోవడం ఖాయమని అంటున్నారు.
Read More..
తన మూవీ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మెగా కోడలు.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్ట్