ఏఐ జర్నలిజం

by Ravi |   ( Updated:2025-04-01 00:45:02.0  )
ఏఐ జర్నలిజం
X

21వ శతాబ్దంలో పూర్వం ఉన్న కంప్యూటర్‌ను తలదన్నేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (AI) అవతరించింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న అనేక దేశాల్లోని చాలా రంగాలను కృత్రిమ మేధ వశపరచుకుంది. ఐటీ, ఇండస్ట్రీ, బ్యాంకింగ్ సర్వీస్, ఎడ్యుకేషన్ లాంటి మరెన్నో రంగాలను స్వాధీనపరచుకొని రాజ్యమేలుతుంది. ఏఐ అనేది జర్నలిజంలో సైతం తన స్థానాన్ని పదిలపరుచుకొని కొత్త విధానాన్ని అందిస్తుంది. సమాచార సేకరణ, నిజనిర్ధారణ, కంటెంట్ విశ్లేషణ, కేస్ స్టడీ, సృజనాత్మకత, పరిశోధన, వాస్తవికత, కచ్చితత్వం, వ్యాసాలు రాయడం, ట్వీట్స్ , సోషల్ మీడియా పోస్టులను అందించడం, బ్రేకింగ్, ఫ్లాష్ ఫ్లాష్, స్క్రోలింగ్ అందించడం లాంటి అనేక నూతన ఫ్యూచర్స్‌తో ఏఐ జర్నలిజాన్ని పరిగెత్తిస్తుంది. అందుకే భవిష్యత్తు జర్నలిస్టులందరూ ఏఐ పట్ల సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి.

అచ్చు యంత్రం నుంచి ఏఐ దాకా...

పూర్వం చరిత్రలో చాలా ఆధారాలు పరిశీలిస్తే రాతి గోడలపై, తాటి ఆకులపై, తాళ పత్ర గ్రంథాలపై లిఖించబడిన ఎన్నో ఆధారాలను మనం చూశాం చదివాం కూడా... మనిషి ఆలోచనల పరిణామ క్రమంలో జాన్ గూటెన్‌బర్గ్ తయారు చేసిన అచ్చు యంత్రంతో ఎంతో లిఖిత గని మానవజాతికి లభ్యమైనది. అచ్చు యంత్రం కనుక్కున్న తర్వాత ప్రపంచం మొత్తం తన రచనను మరింత అందుబాటులోకి తెచ్చాయి ఇది ఒక చారిత్రక ఘట్టం. తదనంతరం మానవ ఆలోచనల పరంపరల సృజనాత్మకతల పరిణామ క్రమంలో ఒక నూతన యుగానికి నాంది పలికింది అదే కంప్యూటర్ కంప్యూటర్ యుగం ప్రారంభం నుండి పూర్వ చారిత్రక లిఖిత పాఠ్యాంశాలను, గ్రంథాలను అచ్చు నుండి డిజిటల్ రంగంలోకి అడుగు వేసిన కంప్యూటర్ అపారమైన మెమొరీని కలిగి ఉండి ఎంత పెద్దవైన రచనలనైనా టైప్ చేసి, స్కాన్ చేసి భద్రపరచుకుంది. ఇది చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచింది. కంప్యూటర్ బంధానికి మానవ జాతి బానిసగా మారిపోయింది.

టెక్నాలజీ లైక్ ఏ సాల్ట్

జర్నలిజంలో సైతం ఏఐ తన స్థానాన్ని పదిల పరుచుకొని కొత్త విధానాన్ని అందిస్తుంది. అన్ని రంగాల్లో లాగా జర్నలిజంను సైతం కృత్రిమ మేథ వదిలిపెట్టలేదు. ఇప్పుడు పని చేస్తున్న జర్నలిస్టులు రేపటి తరం జర్నలిస్టులు కూడా ఏఐ పట్ల ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. ఇప్పటికే మన దేశంలో చాలా న్యూస్ చానల్స్ న్యూస్ ఏజెన్సీలలో న్యూస్ ప్రజెంటర్‌గా, రీడర్‌గా మనం ఇప్పటికే చూసాం కాబట్టి భవిష్యత్తు జర్నలిస్టులందరూ ఏఐ పట్ల సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలి. ఏఐతో కొన్ని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. వ్యక్తిగత భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. జర్నలిస్టులు రాసే వార్తల్లో మానవీయ కోణం, వ్యక్తిగత భద్రత ఉంటాయి. కానీ ఏఐ వల్ల ఇవి సాధ్యం కాకపోవచ్చు. అందుకే అవగాహన కలిగి ఉండాలి. అందుకే అంటారు... టెక్నాలజీ లైక్ ఏ సాల్ట్ అని. దానిని ఎక్కువ తక్కువ కాకుండా మోతాదులో వాడాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని దీని అర్థం.

ఎడ్ల బాబురావు,

పీఆర్ఓ, మెదక్

97013 06838


👉 Read Disha Special stories


Next Story

Most Viewed