నాకు కులం పిచ్చి ఉంది.. క్యాస్ట్ ఫీలింగ్ జిందాబాద్.. నటుడి వీడియోతో షాక్‌లో ఫ్యాన్స్

by Sujitha Rachapalli |   ( Updated:2025-04-08 14:44:19.0  )
నాకు కులం పిచ్చి ఉంది.. క్యాస్ట్ ఫీలింగ్ జిందాబాద్.. నటుడి వీడియోతో షాక్‌లో ఫ్యాన్స్
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ పెట్టే నటుడు శ్రీకాంత్ అయ్యంగార్.. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అంశాలపై కూడా బాగానే స్పందిస్తాడు. తన ఒపీనియన్ షేర్ చేస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా కులపిచ్చి గురించి ఓ క్లిపింగ్ రిలీజ్ చేశాడు. చాలా మంది చాలా రోజులుగా తన కులం గురించి అడగడాన్ని తట్టుకోలేని ఆయన ఫ్రస్ట్రేషన్‌తో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. క్యాస్ట్ ఫీలింగ్ జిందాబాద్ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోపై కొందరు ఏకీభవిస్తే.. ఇంకొందరు మాత్రం విమర్శించారు.

‘‘చాలా మంది మీ కులమేంటి? మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అని అడుగుతున్నారు. నాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. కులం ఫీలింగ్ ఉంది. నా కులం సింగిల్స్ కులం. సింగిల్స్‌గా ఉన్న అందరూ నా అన్నాదమ్ములే. జై సింగిల్. సింగిల్ రాక్స్. అంతే’’ అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇక దీనిపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు ‘‘నేను కూడా సింగిల్ భయ్యా.. నేను నీ కులమే’’ అంటే.. ‘‘ఇంకొందరు తొక్కలో లాజిక్’’ అంటూ తిట్టిపోశారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్లు ఎక్కువైపోతున్నారని ట్రోల్ చేస్తున్నారు.

Next Story

Most Viewed