- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.. డిప్యూటీ CM భట్టి ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వానికి(Congress Govt) ప్రజల పట్ల నిబద్ధత ఉన్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా మధిరలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సన్న బియ్యం ఇస్తాం అంటూ కాలయాపన చేసింది కానీ.. ఏనాడూ ముందడుగు వేయలేదని విమర్శించారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే అమలు చేసినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తాము ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయబోమని ప్రకటించారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణ సంక్షేమ మోడల్(Telangana Model)ను ఆసక్తిగా చూస్తున్నాయని అన్నారు.
రైతులకు రూ.2670 కోట్లు వడ్లకు బోనస్‌గా చెల్లించినట్లు తెలిపారు. అన్నదాతలకు రుణమాఫీ, రైతు భరోసా సొమ్ము చెల్లించినట్లు చెప్పారు. ఏడాదిన్నరలోనే యువతకు 50 వేల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం(Rajiv Yuva Vikasam Scheme) ప్రారంభించామని అన్నారు. రాష్ట్రంలోని 90 లక్షల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. కేవలం సన్నబియ్యం కోసమే ప్రభుత్వం రూ.13,523 కోట్లు ఖర్చు చేస్తోందని అన్నారు. ప్రజలంతా సన్నబియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.