- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భూకబ్జా కేసులో కేటీఆర్ అనుచరుడు అరెస్ట్?
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల ఆన్సైన్డ్ భూముల కబ్జా వ్యవహారంలో రోజుకో పరిణామం వెలుగులోకి వస్తుంది. తాజాగా ఈ భూకబ్జా కేసులో కేటీఆర్అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే కొంతమంది గులాబీ బడా లీడర్లపై కేసులు నమోదు కాగా, ఇటీవల తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని ప్రభుత్వ భూకబ్జా విషయంలో నేరెళ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ భాస్కర్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ప్రస్తుతం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు పెద్దూరులోని ఓ ప్రభుత్వం భూమి ఆక్రమణ విషయంలో పెద్దూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్, కేటీఆర్ అనుచరుడు సలేంద్రి బాలరాజు యాదవ్‌తో పాటు మరో బీఆర్ఎస్ నేత గంగుల బాలయ్యను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అదుపులోకి తీసుకొని అతన్ని ఇవాళ ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారిస్తున్నట్లు సమచారం. కాగా సిరిసిల్లలో భూ కబ్జాల విషయంలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఫార్ములా ఈరేస్ కేసులో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది.