ఇదెక్కడి సంతరా బాబు.. కత్తులతో నరుక్కోవడం ఏంటిరా బావా!

by Bhoopathi Nagaiah |
ఇదెక్కడి సంతరా బాబు.. కత్తులతో నరుక్కోవడం ఏంటిరా బావా!
X

దిశ, కొత్తగూడ : సంతలో అడ్డా పెట్టుకునే విషయంలో బావ, బామ్మర్ధుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ వివాదంలో బామ్మర్ధిపై కత్తితో దాడికి తెగబడ్డాడు బావ. వరంగల్ జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ కుశకుమార్ వెల్లడించారు.

కొత్తగూడ మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. ఈ సంతలో చిరు వ్యాపారులు అడ్డాలను ఏర్పాటు చేసుకోని వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో బావబామ్మర్ధులైన నర్సంపేటకు చెందిన రాము, ముతోజీపేటకు చెందిన సదానందం యథావిధిగా సంతలో వ్యాపారం చేసుకునేందుకు వచ్చారు. అయితే ఒకరి అడ్డాలో మరొకరు వ్యాపారం పెట్టడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బావ సదానందం సహనం కోల్పోయి బామ్మర్ధి అయిన రాము వీపుపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో రాము తీవ్రంగా గాయపడటంతో స్థానికులు స్థానిక ప్రాథమిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అక్కడి వైద్యుడి సూచన మేరకు మెరుగైన వైద్యం కొరకు నర్సంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సదనందాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కుశకుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed