- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కృష్ణానది వెనుక జలాల్లో 21 లక్షల చేప పిల్లలు వదిలిన ఎంపీ
దిశ,నందికొట్కూరు: మత్స్యకారుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి శుక్రవారం పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో కృష్ణానది వెనుక జలాల్లో 21 లక్షల చేపపిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. “మత్స్యకారుల ఆర్థిక ప్రగతికి ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని, టీడీపీ నాయకత్వంలోని ఉమ్మడి ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతికి నూతన పథకాలు ప్రవేశపెడుతూ, వారికి స్థిరమైన జీవనోపాధి కల్పించేందుకు కట్టుబడి ఉందన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా డీఎఫ్సీఎస్ చైర్మన్ బియస్ నవీన్ కుమార్ మాట్లాడుతూ.. “ఈ కార్యక్రమం జలవనరుల సమర్థ వినియోగంతో పాటు మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడంలో దోహదపడుతుందన్నారు. మత్స్య సంపద పెంపొందించడం, మత్స్యకారుల జీవితాల్లో వెలుగులతో కూడిన మార్పులు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా మత్స్యశాఖ చర్యలు చేపడుతున్నట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. కార్యక్రమంలో మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ రాఘవ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ శ్యామల, అసిస్టెంట్ డైరెక్టర్ సంధ్యారాణి, పగిడాల ఎంపీడీవో సుమిత్రమ్మ, నెహ్రూ నగర్ సర్పంచ్ కూరాకుల రాజేశ్వరి, స్థానిక మత్స్యకారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.