- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KCR: ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌ను కలిసిన కేటీఆర్.. కేసుపై గులాబీ బాస్ ఆరా!
దిశ, డైనమిక్ బ్యూరో: ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌లో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శుక్రవారం సాయంత్రం కలిశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా (Erravalli farmhouse) ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్, పట్లోల్ల కార్తీక్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు (Formula E Race case) అంశాలను కేసీఆర్‌కు కేటీఆర్ వివరించారు. నిన్న జరిగిన ఏసీబీ విచారణతో పాటు తాజా పరిమాణలపై గులాబీ బాస్‌తో కేటీఆర్ చర్చించినట్లు సమాచారం.
కాగా, ఫార్ములా ఈ-కార్ రేస్‌కు సంబంధించి గురువారం ఉదయం ఏసీబీ (ACB) విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరైన విషయం విదితమే. నలుగురు అధికారుల బృందం రెండు సెషన్లలో సుమారు 7 గంటల పాటు విచారణ జరిపారు. రేస్‌కు ముందు.. రేస్‌కు తర్వాత జరిగిన అగ్రిమెంట్లు, లావాదేవీలపై ఆరా తీసినట్లు సమాచారం. అలాగే.. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానూ కేటీఆర్‌కు అధికారులు ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ ఓపిగ్గా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. కేసు విషయంలో ఏసీబీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని కేటీఆర్ చెప్పారు.