Maha Kumbh: మందిరాలు- మసీదుల వివాదాల వేళ యూపీ సీఎం కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
Maha Kumbh: మందిరాలు- మసీదుల వివాదాల వేళ యూపీ సీఎం కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మసీదు- మందిరాల వివాదాల వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Uttar Pradesh Chief Minister Yogi Adityanath) కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డుకు(Waqf board) హెచ్చరిక జారీ చేశారు. మహాకుంభమేళా(Maha Kumbh) జరుగుతున్న ప్రాంతం వక్ఫ్ ఆస్తి అనే వాదనలను తప్పుబట్టారు. మహా కుంభమేళాకు ముందు జాతీయ టీవీ నిర్వహించిన ధర్మ సంసద్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత సంస్కృతి పట్ల గౌరవం భక్తి ఉన్న వారికి ప్రయాగ్ రాజ్ వచ్చేందుకు స్వాగతం..అయితే, దురుద్దేశపూరిత మనస్తత్వంతో వచ్చే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారసత్వాన్ని తిరిగి పొందడం గొప్ప విషయం ఇప్పుడు సంభాల్‌లోని షాహీ జామా మసీదులో సనాతన రుజువు కనిపిస్తుంది అన్నారు. అలాగే, ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్‌ను వక్ఫ్‌ భూముల్లో నిర్వహిస్తున్నారని ఓ మత పెద్ద చెప్పడంతో వక్ఫ్‌ బోర్డుపై యూపీ సీఎం తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఇది వక్ఫ్ బోర్డు కాదని ల్యాండ్ మాఫియాల బోర్డు అని విమర్శలు గుప్పించారు. వక్ఫ్ సాకుతో తీసుకున్న ప్రతి అంగుళం భూమిని ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని నొక్కి చెప్పారు. అలాగే, ‘వక్ఫ్’ అనే పదం ఎక్కడ కనిపించినా చెక్ చేస్తామన్నారు. ఆ భూమిని అసలు ఎవరి పేరు మీద రిజిస్టర్ చేశారనే దానిపై విచారణ చేసి.. నిజమైన యజమానులకు తిరిగి ఇచ్చేలా కృషి చేస్తామన్నారు.

గంగానది పరిశుభ్రతపై..

ఇక, 2013లో మారిషస్‌ ప్రధాని గంగాస్నానానికి భారత్‌కు వచ్చినప్పుడు అపరిశుభ్రత, నిర్వహణ లోపం చూసి వెనక్కి వెళ్లిపోయారని యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. అయితే, అప్పుడు యూపీలో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలో ఉందన్నారు. అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్నారని గుర్తు చేశారు. అయితే. ఆ తర్వాత మారిషస్ ప్రధాని 2019లో వారణాసిని సందర్శించినప్పుడు.. కుంభమేళ జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించారన్నారు. ఆరేళ్లలో జరిగిన మార్పును చూశారని.. కుటుంబంతో కలిసి గంగాస్నానం చేశారన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం చేసిన కృషి వల్లే గంగానది పరిశుభ్రంగా మారిందన్నారు.

Advertisement

Next Story