Delhi: పొగమంచు ఎఫెక్ట్.. హైవేపై పరస్పరం ఢీ కొన్న వాహనాలు

by Ramesh Goud |
Delhi: పొగమంచు ఎఫెక్ట్.. హైవేపై పరస్పరం ఢీ కొన్న వాహనాలు
X

దిశ, వెబ్ డెస్క్: దట్టమైన పొగమంచు(Dense Fog) కారణంగా శుక్రవారం తెల్లవారుజామున హైవే పై వాహనాలు పరస్పరం ఢీ(Dehicles Collided) కొన్నాయి. ఈ ఘటన ఢిల్లీ- లక్నో హైవే(Delhi-Lucknow highway)పై జరిగింది. చలికాలం కావడంతో దేశ రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో దట్టమైన పొగమంచు కురుస్తోంది. ఇవాళ ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 9.6 డిగ్రీలకు పడిపోయాయి. ఈ క్రమంలోనే దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ- లక్నో ప్రధాన రహదారిపై బహదూర్‌గఢ్(Bahadur Ghad) సమీపంలో వాహానాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. కారు ముందు అద్దంపై పొగమంచు నిలిచిపోవడంతో ఓ కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. దీని వెనుక ప్రయాణిస్తున్న ఉన్న వాహనాలు వరసగా వచ్చి ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో ఢీ కొన్న వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీనిపై హాపూర్(Hapur) పోలీసులు స్పందిస్తూ.. పొగమంచే ప్రమాదాలకు కారణం అని, ధ్వంసం అయిన వాహనాలను హైవే నుంచి తొలగిస్తున్నామని తెలిపారు. అంతేగాక ఉదయం సమయాల్లో పొగమంచు ఎక్కువగా కురుస్తుండటంతో డ్రైవర్లు వాహనాలు జాగ్రత్తగా నడపాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed