Bandi Sanjay : ఉప్పల్ ఆర్వోబీ పనులపై బండి సంజయ్ కామెంట్స్

by Y. Venkata Narasimha Reddy |
Bandi Sanjay : ఉప్పల్ ఆర్వోబీ పనులపై బండి సంజయ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : కరీంనగర్ ఆర్వోబీ(Karimnagar ROB), ఉప్పల్ ఆర్వోబీ(Uppal ROB), పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం(State Government)సహకరించకపోవడం(Non-Cooperation)తో ఆలస్యం జరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని పలు రైల్వే ప్రాజెక్టుల పనులను బండి సంజయ్(Bandi Sanjay)పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంతో కరీంనగర్ ఆర్వోబీ పనులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి పూర్తిగా కేంద్రం నిధులతో కూడిన సేతు బంధన్ పథకం కింద చేర్చి రూ.154కోట్ల నిధుల మంజూరుతో పనులు జరిపిస్తున్నామన్నారు.

కాగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన భూసేకరణ పనులు ఆలస్యం అవుతుండటంతో ఈ పనుల్లో జాప్యం జరుగుతోంది. త్వరగా ఈ పనులు పూర్తి చెయ్యాలని అధికారులను కోరడం జరిగిందని చెప్పారు.. అలాగే ఉప్పల్ ఆర్వోబీని మూడు నెలల్లో అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సహకరించాలని కోరుతున్నానని తెలిపారు. దీనిపై ఈ రోజు సమీక్ష చేశానని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వాలు నిధులు ఇచ్చినప్పటికి రాష్ట్ర ప్రభుత్వాలు భూసేకరణ చేయకపోవడంతో అనేక అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. ఈ రోజు ఉప్పల్ ఆర్వోబీని 54కోట్లతో పూర్తి చేయిస్తామని హామి ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed