భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఏం పని చేశాడంటే..

by Bhoopathi Nagaiah |
భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఏం పని చేశాడంటే..
X

దిశ, బోథ్ : మండల కేంద్రంలోని భగత్ సింగ్ చౌక్ కాలనీలో కాలేరి శేఖర్ (34) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం శేఖర్ కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని చనిపోయాడు. మృతుడి తండ్రి సంతోష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story