Tirumala Incident:‘వారిద్దరు ఒకేసారి పరామర్శకు ఎందుకు వెళ్లలేదు?’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2025-01-10 10:56:56.0  )
Tirumala Incident:‘వారిద్దరు ఒకేసారి పరామర్శకు ఎందుకు వెళ్లలేదు?’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సర్వదర్శన టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట (Stampede)లో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొక్కిసలాట ఘటనపై వైసీపీ నేతలు స్పందిస్తూ కూటమి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత(YCP Leader), మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) తిరుమల తొక్కిసలాట ఘటన పై మరోసారి ఘాటుగా స్పందించారు. తిరుపతి(Tirupati) తొక్కిసలాట ఘటన చిన్న విషయం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై సరైన చర్యలు తీసుకోలేదంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. నిన్న బాధితులను పరామర్శించాడనికి మాజీ సీఎం జగన్‌ వెళ్తుంటే అడ్డుకున్నారని పేర్కొన్నారు. అయినా.. బాధితులను పరామర్శించడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan) ఒకేసారి ఎందుకు వెళ్లలేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. నిన్న సీఎం చంద్రబాబు(CM Chandrababu) వైఫల్యం వల్లే తిరుపతి ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అధికారులపై కోపం చూపించి ఆయన సాధించింది ఏముందని ప్రశ్నించారు. నిర్లక్ష్యం ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు సంభవిస్తాయని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed