మరోసారి కుంగిన చాక్నవాడి నాలా.. తప్పిన పెను ప్రమాదం..

by Aamani |
మరోసారి కుంగిన చాక్నవాడి నాలా.. తప్పిన పెను ప్రమాదం..
X

దిశ,కార్వాన్ : గోషామహల్ నియోజకవర్గం లోని చాక్నా వాడి నాల మరోసారి కృంగింది. గతంలో కృంగిన నాలా పనులు జరుగుతుండగా ప్రక్కనే ఉన్న మరో నాలా కృంగి క్రషర్ లారి నాలాలో పడింది.దీంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే.. గత ప్రభుత్వ హయాంలో చాక్నావాడి లో ఉన్న నాలా కూలింది. దీంతో అప్పటి ప్రభుత్వం మంత్రులు అధికారులు సందర్శించి నాలా పనులు పూర్తి చేశారు. కాగా కొన్ని రోజుల క్రితమే చాక్నావాడిలో అదే నాలా మళ్ళీ క్రుంగింది. దీంతో అధికారులు మరమ్మతులు చేసేందుకు పనులు ప్రారంభించారు. ఇది ఇలా ఉండగా పనులు జరుగుతున్న సమయంలో దారుసలాం రోడ్డు నుండి చాక్నావాడికి వెళ్లే రోడ్డు లో ప్లైవుడ్ దుకాణాల ముందు మరోసారి నాలా గురువారం అర్ధరాత్రి కృంగింది. అంతే కాకుండా నాలాలో క్రషర్ లారీ పడిపోయింది. అప్రమత్తమైన డ్రైవర్ ఎట్టకేలకు ప్రాణాలతో బయటపడ్డాడు.

స్థానికులు..

అతిపురాతన మైనా నాలా కావడంతో ఇప్పటికే మూడోసారి కృంగినట్లు స్థానికులు తెలిపారు. నాలా మొత్తం పునరుద్ధరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వనికి మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇలా ప్రతి సారి నాలాలు కృంగడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడ్డారు. అంతే కాకుండా నిత్యం నాలాలు కృగడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం చొరవ కల్పించుకొని తమ సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని స్థానికులు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed